రోజూ స్నానం చేయడం మంచిదేనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రతి రోజు స్నానం చేయడం మంచిదా ?. కాదా? అన్న సందేహం చాలా మందిలోఉంది. కొందరు మంచిదంటే.. మరికొందరు కాదు అంటారు. అయితే ఈ ప్రశ్నకు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. దుమ్ము, ధూళిలో తిరిగే వారు ప్రతీ రోజూ తలస్నానం చేస్తేనే మంచిది. జిడ్డు పోయి ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. జుట్టు కుదళ్ల నుంచి నూనెలు స్రవిస్తాయి. దీంతో వెంట్రుకలు సహజంగా మెత్తగా, స్మూత్‌గా ఉంటాయి. కానీ రోజూ తలస్నానం చేయడం వల్ల నూనెలు స్రవించే శాతం తగ్గిపోతాయి. దీంతో శిరోజాలు పొడిబారిపోతాయి. అందువల్ల దుమ్ములో తిరగని వాళ్లు రోజూ తలస్నానం చేయకుంటేనే మంచిది. జుట్టు పొడిబారినప్పుడు రెగ్యులర్‌గా తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అలాగే విటమిన్-సి లోపం వల్ల కూడా జట్టు రాలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు వెంట్రుకల మొదళ్లు కూడా బలోపేతం అవుతాయి
అని నిపుణులు చెబుతున్నారు.