క్రిస్మస్ తర్వాత రెండు వారాల లాక్ డౌన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బ్రిటన్ లో పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్‌డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్‌డౌన్ సిఫారసు కూడా ఉంది. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా… మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్‌లలో ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి.