తగ్గనున్న వంటనూనె ధరలు
1 min readపల్లెవెలుగువెబ్ : సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న వంటనూనె ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్రం శుభవార్త చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ తన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ కస్టమ్స్ సుంకం తగ్గింపు అనేది మార్చి 2022 వరకు వర్తిస్తుందని సీబీఐసీ తెలిపింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించనున్నట్లు సీబీఐసీ జారీ చేసిన నోటిషికేషన్లో పేర్కొన్నారు .