PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థియేట‌ర్లు బంద్ ?

1 min read

హైద‌రాబాద్: క‌రోన విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ముంద‌స్తు జాగ్రత్త చ‌ర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించింది. క‌రోన సకెండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న నేప‌థ్యంలో క‌ట్టుదిట్టమైన చ‌ర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మ‌రొక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో థియేట‌ర్లు బంద్ చేయాల‌ని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కేంద్రాన్ని కోరింది. లేనిప‌క్షంలో 50 శాతం మించి థియేట‌ర్లు భ‌ర్తీ కాకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతోంది. లాక్ డౌన్ తర్వాత సినిమాల విడుద‌ల సంఖ్య పెరిగింద‌ని, దీంతో థియేట‌ర్లకు ప్రజ‌లు భారీగా వ‌స్తుడంతో సామాజిక దూరం పాటించ‌డం క‌ష్టమ‌వుతోంద‌ని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప‌క్క ప‌క్క సీట్లలో కూర్చోవ‌డం, మాస్క లు ధ‌రించ‌క‌పోవ‌డంతో కేసుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప్రజ‌లు ఎక్కువ‌గా గుమిగూడే ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచ‌న‌ల‌కు కేంద్రం ప్రభుత్వం నుంచి ఏమేర‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంద‌నేది వేచిచూడాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాద‌న‌లు కనుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించ‌న‌ట్టయితే.. తెలంగాణ‌లో థియేట‌ర్లు మూత‌ప‌డే అవ‌కాశం ఉంది.

About Author