పబ్లిక్ ఇష్యూకి రానున్న `స్నాప్ డీల్`
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ మేరకు అనుమతి కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓ ద్వారా కొత్తగా షేర్లు జారీ చేసి రూ.1,250 కోట్లు సమీకరిం చాలని కంపెనీ భావిస్తోంది. స్నాప్‌డీల్ ఈక్విటీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పీఈ సంస్థలు కూడా ఈ ఇష్యూ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపం లో 3.07 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి. అయితే స్నాప్‌డీల్ ప్రమోటర్లు కునాల్ బహాల్, రోహిత్ బన్సాల్ మాత్రం తమ వాటా నుంచి ఒక్క షేరు కూడా ఈ ఐపీఓ ద్వారా విక్రయించడం లేదు.