PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విడాకుల ఖరీదు .. అక్ష‌రాల 5,527 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దుబాయ్ రాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌క్దూమ్ త‌న భార్య‌తో విడాకుల సెటిల్ మెంట్ కోసం రూ.5527 కోట్లు చెల్లించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. జోర్డాన్ రాకుమారి హయా బింట్‌ అల్‌ హుస్సేన్ దుబార్ రాజు ఆరో భార్య‌. ఈ మేర‌కు బ్రిట‌న్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో రూ.2,521 కోట్లను హయాకు ఏకమొత్తంలో చెల్లించాలని పేర్కొంది. రషీద్‌ భార్యల్లో హయా అందరికన్నా చిన్నవారు. వీరికి అల్‌ జలిలియా (14), జయాద్‌ (9) పిల్లలు. పిల్లల చదువు కోసం రూ.96 కోట్లు, వారి బాధ్యతల కోసం రూ.112 కోట్లు ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతర అసవరాలకుగాను రూ.2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. చ‌రిత్ర‌లో ఇది అత్యంత ఖ‌రీదైన విడాకుల వ్య‌వ‌హారంగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

                               

About Author