వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తున్న సందర్భంలో కార్పొరేట్ కంపెనీలు వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేశాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతం ఇచ్చేదిలేదంటూ తేల్చిచెప్పాయి. సెమీకండక్టర్‌లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది.