‘కాటసాని’ కుమారుడి వివాహానికి విచ్చేసిన సీఎం జగన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి వివాహ మహోత్సవం పంచలింగాల మాంటిస్సోరి ఒలంపస్ స్కూల్లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరై నూతన వధూవరులు శివ నరసింహారెడ్డి,రూపశ్రీ లను ఆశీర్వదించారు.
ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఓర్వకల్లు ఎయిర్ పోర్టకు 11.45 గంటలకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్… 12.08 గంటలకు పంచలింగాల మాంటిస్సోరి హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అనంతరం 12 :30 నిమిషాలకు వివాహ వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి వర్యులు నూతన వధూవరులు శివనరసింహారెడ్డి, రూప శ్రీ లను ఆశీర్వదించారు.
వివాహ వేడుకల అనంతరం ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు చేరుకొని 01:15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వర్యుల వెంట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం ఎల్ సి గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎం ఎల్ సి చల్లా భగీరథ రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి,పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవీ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.