ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే భారీ పన్ను మినహాయింపు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ పన్ను మినహాయింపు ప్రకటించింది. డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకిన వేళ.. ప్రజలు కూడ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పన్న ప్రయోజనాలు కల్పిస్తోంది. భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం వ్యక్తిగతంగా వినియోగించే కార్లు లగ్జరి ఉత్పత్తుల కిందకి వస్తాయి. అందువల్ల ఉద్యోగస్తులకు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అయితే కొత్తగా చేర్చిన సెక్షన్ 80ఈఈబి కింద రుణం తీసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి మాత్రం పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చింది.