బాయ్ ఫ్రెండ్ కోసం.. ఇద్దరు అమ్మాయిల ఫైటింగ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆసక్తికర ఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం నడిరోడ్డుపైన కొట్టుకున్నారు. దారుణంగా బూతులు తిట్టుకున్నారు. వాడు నావాడంటే.. కాదు నావాడంటూ
రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసుటు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అందరూ చూస్తూండగానే ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల వారు చోద్యం చూసినట్టు చూశారు.