డీ విటమిన్ లోపం.. పిల్లలకు ప్రమాదకరం
1 min readపల్లెవెలుగువెబ్ : పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో డీ విటమిన్ చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. రోజూ శరీరానికి సరిపడా డీ విటమిన్ అందితేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. శరీరానికి సరిపడా విటమిన్ డీ సూర్యరశ్మి నుంచే సహజంగా వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియంను కండరాలు, ఎముకలకు అందించడంలో ‘డీ’పాత్ర అత్యంత కీలకం. రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉంటే విటమిన్ ‘డీ’సమతుల్యత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. పెద్దల్లో ఎముకల అరుగుదల వేగంగా ఉంటుంది. దీని ప్రభావంతో కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో పాటు నిద్రలేమి, అలసత్వం, డిప్రెషన్, ఒంటినొప్పులు వరుసగా వస్తుంటాయి. మారుతున్న జీవనశైలి వల్ల కూడ విటమిన్ల సమతుల్యత దెబ్బతింటోంది.