తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
1 min readఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు దేశీయ చమురు సంస్థలు లీటరు పెట్రోల్ మీద 18 పైసలు, డీజిల్ మీద 17 పైసలు తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ 91.17 పైసలు ఉండగా.. 18 పైసలు తగ్గి, లీటరు పెట్రోల్ ధర 90.99 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర 81.47 రూ. ఉండగా.. 17పైసలు తగ్గి.. 81.30 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 94.61 ఉండగా.. డీజిల్ ధర 88.42 గా నమోదైంది. గత కొంత కాలంగా దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఎన్నడూ లేనంతగా అంతర్జాతీంయగా ముడి చమురు ధరలు తగ్గినా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులకు పెట్రోల్ , డీజిల్ ధరలు గుదిబండగా మారాయి. గత నెలలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 100 మార్కును చేరుకుంది. ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత వరకు నిలకడగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.