NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేరుశెన‌గ విత్త‌నాలు తిన్నాక నీళ్లెందుకు తాగ‌కూడ‌దంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వేరుశెన‌గ విత్త‌నాలు తిన్నాక నీరు తాగ‌కూడ‌ద‌ని చాలా మంది పెద్ద‌లు చెబుతుంటారు. ఎందుకు తిన‌కూడ‌దో కానీ చాలా మందికి తెలియ‌దు. వేరుశెనగలు చాలా పొడి స్వభావం కలిగి ఉండటం వల్ల అధిక దాహాన్ని ప్రేరేపించే ధోరణిని కలిగి ఉంటాయి. తిన్న వెంటనే నీటిని తాగకూడదంటారు. ఇందులో నూనె ఉండటం వల్ల తిన్న తర్వాత నీటిని తీసుకోవడం వల్ల ఆహార పైపులో కొవ్వు పేరుకుపోవచ్చు. ఫలితంగా చికాకు మరియు దగ్గు వస్తుందని చెబుతున్నారు. రెండో సంగతి పల్లీలు తినగానే నీరు తాగితే త్వరగా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావొచ్చు. మూడో సంగతి ఏంటంటే… పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు తిన్న వెంటనే నీటిని తాగితే అవి చల్లగా మారతాయి. దీని వల్ల లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి.

                                

About Author