PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వ్యాక్సిన్​’ పై అపోహాలు వద్దు

1 min read
కోవిడ్​ వ్యాక్సిన్​ ప్రక్రియను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు

కోవిడ్​ వ్యాక్సిన్​ ప్రక్రియను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు

  • ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
    పల్లెవెలుగు వెబ్​, చిట్వేల్: మండలంలోని వెంకటరాజుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం కోవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ, 45 ఏళ్ళుపైబడిన దీర్ఘ కాలిక వ్యాధులున్నవారు, బీపీ, షుగర్ సంబంధిత వ్యాధులున్న వారు డాక్టర్స్ సూచనతో కోవిడ్​ వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచించారు. కోవిడ్​ వ్యాక్సిన్​తో ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు వెల్లడించారు.

About Author