అసెంబ్లీలో.. మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం పొందింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి ఇకపై జైలు శిక్ష విధించే నిబంధనను ఇందులో పొందుపరిచారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ బిల్లును ఆరెఎస్ఎస్ అజెండాగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభివర్ణించారు. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు- 2021.. ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, బలవంతంగా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ, సామూహికంగా కానీ మతమార్పిడులను నిరోధిస్తుంది.