PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో.. పాతదుకాణాలనే కుదించి కేటాయించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీశైల పుణ్యక్షేత్రంలో పాతదుకాణాలనే కుదించి నెలసరి అద్దెల పెంపు ప్రాతిపదికన కేటాయించాలని దేవస్థానం మార్కెట్ వ్యాపారులు కోరుతున్నారు. శుక్రవారం నూతన దుకాణాల కేటాయించే డిప్ విధాన కార్యక్రమం హైకోర్టు స్టే ద్వార వాయిదా పడ్డాయి. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాపారాలు మాట్లాడారు. నూతన దుకాణాలు వ్యాపారాలకు అనుకూలంగా లేవని, వాటిని కేటాయిస్తే అధిక  అద్దెలు చెలించలేమని వ్యాపారులు వాపోయారు. దేవస్తానం ఈఓ, ఎమ్మేల్యే చొరవ తీసుకుని పాతదుకాణాలనే కుదించి ఎవరి షాపులను వారికే కేటాయించి ఆదుకోవాలని వ్యాపారులు కోరారు.

About Author