మద్యం తాగడానికి.. కనీస వయసు తగ్గింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : హర్యాణ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. మద్యపానం చేయడానికి గతంలో కనీస వయసు 25 ఉండాలనే నిబందన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించింది. మద్యం సేవించడానికి కనీస వయసు 21సంవత్సరాలకు తగ్గించింది. హర్యాణ విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది.