లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర ఆరోగ్యశాఖ లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య వంద దాటింది. దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని సర్వత్రా చర్చకొనసాగుతోంది. ఐతే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే శనివారం లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులకు చేరుకుంటే తప్ప, అప్పటివరకూ లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని మీడియాకు వెల్లడించారు.