కురువలు అన్ని రంగాల్లో రాణించాలి: గుడిసె శివన్న
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని కొత్త బస్టాండ్ సమీపం లోని శ్రీ మేధ జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లా కురువ సంఘం నూతన కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం లో రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు గుడిసె శివన్న ,రాష్ట్ర కురువ యువజన సంఘం అధ్యక్షులు హాల్వి గర్జప్ప ,ఉపాధ్యక్షులు కే .పరమేష్ ,వారి మేధా కళాశాల డైరెక్టర్ కే .రాము ,జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి ఎం .దేవేంద్రప్ప ,ఎం .కే .రంగస్వామి ,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న లు ప్రసంగించారు .ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఎం .దేవేంద్రప్ప మాట్లాడుతూ జిల్లా లోని కురువలు ఆర్థికంగా ,విద్యాపరంగా ,రాజకీయంగా ఎదగాలని చెప్ప్పారు .
రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూ జిల్లాలో 6 లక్షల జనాభా గల కురువలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించవలెనని చెప్పారు .అనంతరం 2022 నూతన కేలండర్ ను ఆవిష్కరించారు .ఈ సమావేశంలో జిల్లా నాయకులు బి .వెంకటేశ్వర్లు ,టి .పాలసుంకన్న ,బి .మల్లికార్జున ,బుదూర్ లక్ష్మన్న ,బి .సి .తిరుపాల్ ,,ఈశ్వరయ్య ,చిరంజీవి ,నగర సంఘం కార్యదర్శి బి .రామకృష్ణ ,కే .వెంకటేశ్వర్లు ,కే .దివాకర్ ,సోమన్న ఓర్వకల్ ,గూడూరు ,కర్నూల్ మండల కురువ సంఘం అధ్యక్షులు అల్లబాబు ,కే .కృష్ణ ,కే .రాంగోపాల్ ,టి .రామచంద్రుడు ,remata సర్పంచ్ కే .వెంకన్న తదితరులు పాల్గొన్నారు.