కృష్ణానదిలో.. బోట్ల పనితీరు పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: కృష్ణానదిలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు 4 సంఖ్యల IRB బోట్లతో డైరెక్టర్ జనరల్ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ IPS సిబ్బందితో కలిసి రెస్క్యూ ట్రైనింగ్ ట్రయల్ నిర్వహించారు. ఈ రెస్క్యూ ట్రైనింగ్ ట్రయల్లో 24 మంది సభ్యులతో ఫైర్ సర్వీస్,NDRF,SPF బృందాలు పాల్గొన్నాయి. నదిలో 80 కి.మీ డ్రైవ్ కోసం మేము బోట్ల పనితీరు మరియు పురుషుల ఫిట్నెస్, వరదల సమయంలో నీటిలో రక్షించే నైపుణ్యాలను తనిఖీ చేశారు.