పేదోడి ఇంట్లో గవర్నర్ భోజనం.. బిల్లు రూ. 14 వేలు !
1 min readపల్లెవెలుగువెబ్ : మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ బుద్రామ్ అనే వ్యక్తి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వింత పరిస్థితి ఎదురైంది. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్, ఫ్యాన్లను అమర్చారు. అయితే బుధ్రామ్ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు. కార్యక్రమం పూర్తయ్యాక అధికారులు బుద్రామ్ చేతిలో రూ.14 వేలు పెట్టి వెళ్లిపోయారు.