రివార్డ్ పాయింట్స్ పేరుతో లింక్.. అకౌంట్ లో డబ్బు మాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. క్షణాల్లో అకౌంట్లలో డబ్బు మాయం చేస్తున్నారు. హైదరాబాద్ లోని బాలానగర్ పరిధిలోని ఐడీపీఎల్ కు చెందిన సుభాష్‌కు కొటక్ మహింద్ర బ్యాంకులో అకౌంట్ ఉంది. సుభాష్ క్రెడిట్ కార్డుకు రివార్డ్ పాయింట్స్ లింక్ పంపారు. అది నమ్మిన సుభాష్ తన బ్యాంక్ అకౌంట్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఇచ్చాడు. వెంటనే సుభాష్ అకౌంట్ నుంచి 1.11 లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో సుభాష్ కంగుతిన్నాడు. బాలానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.