భర్తీ కాని 30 వేల ఇంజినీరింగ్ సీట్లు
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో 30 వేల ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కోటాలో 30 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. సీఈటీ 2021 ర్యాంకుల ఆధారంగా కర్ణాటక పరీక్షా ప్రాధికార ఇంతవరకు మూడు విడతల కౌన్సెలింగ్ ద్వారా 22,713 సీట్లను భర్తీచేసింది. రాష్ట్రంలో మొత్తం 341 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఇందులో 60 శాతం ప్రభుత్వ కోటా సీట్లు కాగా, మిగిలిన 40 శాతం సీట్లను ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా కింద వదిలేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో మొత్తం అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో 53,431 సీట్లు ఉండగా, శనివారం నాటికి 22,713 సీట్లను మాత్రమే భర్తీ చేయగలిగామన్నారు.