ప్రికాషన్ డోస్.. ఎవరు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి ?
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ చేయనున్నట్టు స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ప్రికాషన్ డోసు ఎవరు తీసుకోవాలి ?. ఎలా తీసుకోవాలి ? ఏయే ధృవపత్రాలు అవసరం ? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. ప్రికాషన్ డోసు తీసుకోవడానికి అందరూ అర్హులు కాదు. ప్రస్తుతానికి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ప్రికాషన్ డోసుకు అర్హులు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు తమ అనారోగ్య సమస్యలకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ వైద్యుడి నుంచి తీసుకున్న ఈ ధృవపత్రాన్ని స్కాన్ చేసి కోవిన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. లేదా వ్యాక్సినేషన్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. ప్రికాషన్ డోసు కావాల్సిన వారు కోవిన్ యాప్ లో బుక్ చేసుకోవాలి. ఇందుకోసం త్వరలోనే బుకింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.