NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా జీవితంలో అతిపెద్ద అనుమానం ఇదే : ఆర్జీవీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. రాత్రి క‌ర్ఫ్యూలు, వేడుక‌ల నిర్వ‌హ‌ణ ఆంక్ష‌లు, థియేట‌ర్ల పై ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ‘‘వివాహాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, థియేటర్లు.. ఇలా ప్రతి చోటా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం పొలిటికల్‌ ర్యాలీలపై మాత్రం ఎందుకు పెట్టలేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘నా జీవితంలో అతిపెద్ద అనుమానం ఏమిటంటే.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిర్వహించే రాత్రి కర్ఫ్యూ కారణంగా ఉద్ధృతంగా విస్తరిస్తోన్న వైరస్‌ ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో తెలియడం లేదు’’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

                             

About Author