తగ్గిన ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఫ‌్రీడమ్ సన్ ప్లవర్ ఆయిల్ ధరలు తగ్గినట్టు కంపెనీ పేర్కొంది. దిగుమతి సుంకాలు తగ్గడంతో ఫ్రీడమ్ ఆయిల్ ధరలు తగ్గినట్టు కంపెనీ ప్రకటించింది. లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్‌ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో లీటరు వంట నూనె ధర దాదాపు రూ.180 స్థాయికి చేరింది. నాటి నుంచి ధరల అదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పరిస్థితులకు తగ్గట్లు సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ వచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు దిగివచ్చాయని కంపెనీ తెలిపింది.