జగన్ బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సోమవారం మరోసారి వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. ఇటీవలే ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే అంశం పై సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.