లాభాల్లో స్టాక్ మార్కెట్ .. భారీ నష్టాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు అనంతరం లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వైరస్ భయాలు వెంటాడినప్పటికీ ఇంట్రాడే కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో సూచీలను లాభాల్లో నిలిపారు. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజ్ మెంట్ మార్పు నేపథ్యంలో కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్ ని తాకాయి. సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 57,420 వద్ద, నిప్టీ 82 పాయింట్ల లాభంతో 17086 వద్ద ముగిసింది.