బస్సు ప్రయాణం.. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా రాష్ట్రాలు కఠినమైన ఆంక్షల్ని అమలుచేస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంతో పాటు బెంగళూరు నగరంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హోటళ్లు, మాల్స్, బార్-రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు అధికం గా గుమిగూడే అవకాశం ఉన్న అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ నియమాలను అమల్లోకి తీసుకురానున్నారు. ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించే వారు కూడా ఇకపై రెండు డోసుల సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే మౌఖికంగా రవాణా శాఖ అధికారులకు సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.