అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కేంద్రానికి కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. న్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది.