421 పోస్టుల భర్తీకి శ్రీకారం
1 min readయూపీఎస్సీ.. ఈపీఎఫ్ఓ-2020 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 2020లోనే పూర్తీ కావాల్సిన పరీక్షలు కరోన కారణంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వాటిని భర్తీ చేయడానికి యూపీఎస్సీ సన్నద్ధమైంది. ఈ నోటిఫికేషన్ ద్వార వివిధ శాఖల్లోని 421 ఖాళీలు భర్తీ చేయడానికి యూపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సిద్దమవ్వాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగ ఖాళీలు ఉన్న విభాగాలు: ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్\అకౌంట్స్ ఆఫీసర్,
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్,
మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ విభాగం
పరీక్ష తేది: మే 9, 2021
ఖాళీల సంఖ్య: 421
పరీక్ష విధానం: రెండు దశల్లో ఉంటుంది. మెదటి దశ రాత పరీక్ష
రెండో దశ ఇంటర్య్వూ
రాత పరీక్ష: పెన్ అండ్ పేపర్ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. రెండు గంటల్లో పరీక్షను పూర్తీ చేయాలి. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1\3 వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి. పేపర్ ఇంగ్లీష్\ హిందీలో ఉంటాయి.
ఇంటర్య్వూ: రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్య్యూ ఉంటుంది. దీనికి కూడ 100 మార్కులుంటాయి. ఈ మొత్తం మార్కెల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 45 మార్కులు, ఎస్సీ\ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. వీటిని రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో కలిపి జాబితా రూపొందిస్తారు. రాత పరీక్షకు 75 శాతం, ఇంటర్య్వూ కు 25 శాతం వెయిటేజ్ ఇస్తారు.
సిలబస్: ఇందులో ప్రధానంగా తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
ప్రధానంగా ఇంగ్లీష్, భారత స్వాతంత్రోద్యమం, కరెంట్ ఈవెంట్స్, ఇండియా పాలిటి- ఎకానమి, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్, ఇండస్ర్టీయల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, జనరల్ మెంటల్ ఆప్టిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. పాత పేపర్ల సాధన ద్వార అభ్యర్థులు పరీక్ష లో విజయం సాధించవచ్చు.