హిందూ ధర్మం కోసం.. ప్రాణాలర్పించిన వీరుడు ‘స్వామి శ్రద్ధానంద’
1 min readవిశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: హిందూ ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప హిందూ మార్గదర్శకుడు స్వామిశ్రద్ధానంద అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్. స్వామి శ్రద్ధానంద 95 వ వర్ధంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కేంద్రం సమితి పిలుపు మేరకు ధర్మరక్షా దివస్ పేరుతో ప్రతి 2 లక్షల జనాభా ఉన్న ప్రఖంఢ కేంద్రం లో నిర్వహిస్తున్నామని, సోమవారం లీడర్ సెక్షన్ కాలని,యన్.టీ.ఆర్.బిల్డింగ్స్ లో ఉన్న శ్రీ కోదండరాముని ఆలయంలో ధర్మదీక్షా దివస్ సభ జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్ మాట్లాడుతూ 1856, ఫిబ్రవరి 22 న పంజాబ్ లో తల్వాన్జలంధర్ రాజ్యంలో జన్మించిన స్వామిశ్రద్ధానంద… కాంగ్రీ గురుకుల విద్యాలయం తో సహా అనేక విద్యాలయాలు స్థాపించి విద్యాసేవ సేవ చేశారని, హిందీ,ఉర్దూ భాషల్లో మతపరమైన వ్యాసాలు రాశారని గుర్తు చేశారు. అనంతరం విశ్వహిందూపరిషత్ కర్నూలు నగర కార్యాధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ ధర్మపరిరక్షణలో తన ప్రాణాలను బలిదానం చేసిన శ్రద్దానంద స్వామి ని ఆదర్శంగా తీసుకుని భారతదేశం లో మంతాంత్రీకరణను నియంత్రించడంలో హిందూ యువకులు పాత్ర ఎంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్,
కర్నూలు నగర విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సత్సంఘ కో కన్వీనర్ శేఖర్,బజరంగ్దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్ మధు,కోటి,జయరాముడు,నరేష్,లోకేష్,ఆది,అంజి,మద్దిలేటి,పాండు,చందు,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.