NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

RTO అధికారుల దాడులు ఆపాలని AITUC ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని ఆటో కార్మికులపై ఆర్టీవో అధికారులు దాడులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలని అలాగే ట్రాఫిక్ పోలీసుల దాడులు ఆపాలని ఈరోజు కర్నూలు RTO ఆఫీస్ ముందు AITUC    ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు రాము అధ్యక్షతన ధర్నా జరిగింది.  

ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర అధ్యక్షుల B వెంకటేష్ ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ఈశ్వర్  ఆటో యూనియన్ నగర కార్యదర్శి ఆర్ కిట్టు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇరవై వేల పైచిలుకు ఆటో కార్మికులు ఆటోలను నంముకోని జీవనం కొనసాగిస్తున్న సందర్భంగా రెండు  సార్లు కరోనా వచ్చి ఆటో కార్మికుల జీవితాల్లో ఒక్కసారిగా చీకటి మయం చేసి వారి కుటుంబాలు చాలా దుర్భరమైన ఎటువంటి అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి  ఇప్పుడిప్పుడే ఆటో కార్మికుల కుటుంబాల్లో మెల్లమెల్లగా జీవితాలను  బాగుచేసుకుంటున్నా సందర్భంగా RTO  అధికారుల  దాడులు చేయడం చాలా బాధాకరమని తక్షణమే ఆ దాడులను ఆపాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 21 ఉపసంహరించుకోవాలని వారు  ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.   లేని పక్షంలో ఏపీ అటో వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో పెద్దఎత్తున  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని  వారు హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో అధికారులను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది . కార్యక్రమంలో  AITUC ఆటో యూనియన్ నగర నాయకులు జయరామ్ రెడ్డి రత్నం, శ్రీనునాయక్, ఈశ్వర్రెడ్డి ,నాగరాజు స్వాములు, బిల్డింగులు నాగరాజు ,  గార్గేయపురం వెంకటేష్, టీవీ నైన్ మధు గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

About Author