లైంగిక వేధింపుల నివారణ.. జేఎన్ యూ వివాదాస్పద సలహా !
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ లైంగిక వేధింపుల నివారణ విషయంలో అమ్మాయిలకు వివాదాస్పద సలహా ఇచ్చింది. లైంగింక వేధింపుల అవగాహన పై జనవరిలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన సర్క్యులర్ ఒకటి వెబ్ సైట్ లో ఉంచింది. అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా… స్నేహపూర్వక పరిహాసానికి, లైంగిక వేధింపులకు మధ్య ఉన్న సన్నని గీత దాటుతారని అందులో పేర్కొంది. ఇలాంటి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు అమ్మాయిలు, వారికి వారి మగస్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీత ఎలా గీయాలో తెలుసుకోవాలని పేర్కొంది. దీనిపై జేఎన్ యూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ రేఖాశర్మ కూడ దీనిపై స్పందించారు. దీనిని స్ర్త్రీ ద్వేషపూరిత సర్క్యులర్ గా పేర్కొన్నారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.