లీటర్ పెట్రోల్ పై రూ. 25 తగ్గింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకున్నారు. ద్విచక్రవాహనాలకు లీటర్ పెట్రోల్ పై రూ. 25 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని, కనీసం వ్యవసాయ ఉత్పత్తులను కూడ మార్కెట్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కలిగిన వాహనదారులకు లీటర్ పెట్రోల్ పై రూ. 25 తగ్గిస్తున్నామని, పది లీటర్ల వరకు ఆ డబ్బును వారి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు.