PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్​ పోర్ట్​

1 min read
ఎయిర్​పోర్ట్​ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్​ జగన్​, పక్కనే మంత్రులు, కలెక్టర్​

ఎయిర్​పోర్ట్​ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్​ జగన్​, పక్కనే మంత్రులు, కలెక్టర్​

ప్రకటించిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి
– ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడికి ఘననివాళి అర్పించిన సీఎం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రేనాటి వీరుడు..ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు ఎయిర్​పోర్ట్​కు నామకరణం చేస్తున్నట్లు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు ఎయిర్​ పోర్ట్​ను ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి… ఎయిర్​ పోర్ట్​ను ప్రారంభించిన అనంతరం.. వేలాది మంది ప్రజల హర్షాతిధ్వనుల మధ్య సభావేదికపై ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్​ పోర్ట్​గా నామకరణం చేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ( గురువారం) ఈ రోజు అని, ఎయిర్​ పోర్ట్ ప్రారంభంతో న్యాయరాజధాని కర్నూలు తో ఇతర ప్రాంతాలకు విమానయానం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో… 6వ ఎయిర్​పోర్ట్​
2019 ఎన్నికల ముందు హడావుడిగా.. అసంపూర్తిగా ..ఎటువంటి డిజిసీఏ అనుమతులు లేకుండా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎద్దేవ చేసిన సీఎం వైఎస్​ జగన్​… రూ. 110 కోట్లను ఖర్చు పెట్టి ఒకటిన్నర సంవత్సరం లోపు యుద్ధప్రాతిపాదికన ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేశామని వెల్లడించారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టును రాష్ట్రంలో 6వ ఎయిర్ పోర్టుగా ప్రారంభించామని .. ఈ నెల 28 నుండి ఓర్వకల్ ఎయిర్ పోర్టు నుండి తొలి కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ మొదలవుతాయన్నారు.
జాతీయ జెండాకు.. వందనం..
అనంతరం.. కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఆ తరువాత ఓర్వకల్ విమానాశ్రయం వద్ద ఉన్న జాతీయ జెండాకు జెండా వందనం చేసిన సీఎం.. ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ భవనం ముందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎయిర్​ పోర్ట్​ ప్రారంభం..
డిపార్చర్ గేటు వద్ద రిబ్బన్ కటింగ్ చేసి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనంతరం, విమానాశ్రయం లోపల భవనాలను పరిశీలించారు. సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగి..ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు బయలు దేరి వెళ్లారు.

About Author