పార్లమెంట్ లో ఎంపీలు కొట్టుకున్నారు
1 min readపల్లెవెలుగువెబ్ : జోర్డాన్ పార్లమెంట్ లో ఎంపీలు ఒకరినొకరు కొట్టుకున్నారు. రాజ్యాంగానికి ప్రతిపాదిత సవరణలపై ఆ దేశ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చలో పాల్గొన్న ఓ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో… క్షమాపణలు చెప్పాల్సిందిగా సదరు ఎంపీని స్పీకర్ కోరారు. దీనికి ఎంపీ తిరస్కరించడంతో సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా వాదనలకు దిగిన ఎంపీలు చివరకు కొట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు కిందపడ్డారు. ఇదంతా ప్రభుత్వ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ సంఘటనలో సభ్యులెవరూ గాయపడలేదని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.