మరోసారి.. బంగారం భగభగ !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ వ్యాప్తి సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోన ఉదృతి తగ్గిన నేపథ్యంలో కొంతమేర ధరలు దిగివచ్చాయి. అయితే.. 2022లో మరోసారి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.50వేల లోపే పలుకుతోంది. అయితే, కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదల తప్పేలా కన్పించట్లేదు. 2022లో పుత్తడి ధర మళ్లీ పెరిగే అవకాశముందని, 10 గ్రాముల ధర రూ.55 వేల పైకి చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్‌పై నెలకొన్న అనిశ్చితే దీనికి కారణమంటున్నారు.