బాలల హక్కులను కాపాడుదాం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: వీధి బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఆర్ఓ పుల్లయ్య నేతృత్వంలో జరిగిన సమీక్షలో వీధిబాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమీక్షలో ఐసీడీఎస్ డీపీఓ ( జేబ్ల్యూ), సీడబ్ల్యూసీ చైర్మన్, డీసీఎల్, డీసీపీఓ, డీసీఆర్బీ తదితరులు పాల్గొన్నారు.