భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి
1 min readసీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
పల్లెవెలుగు వెబ్, మైదుకూరు: రైతు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వానికి నిరసనగా శుక్రవారం చేపట్టనున్న భారత్ బంద్‌కు ప్రజలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సంపూర్ణ మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి పి. శ్రీరామలు పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి పి.శ్రీరాములు, AITUC ఏరియా కార్యదర్శి ఏ.వి. శివరామ్, సిపిఎం మండల కార్యదర్శి ఎం.షరీఫ్ మాట్లాడుతూ వ్యవసాయంలో తీసుకొచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాలను నాలుగు కోడ్ ల నుండి మినహాయించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్లతో చేపడుతున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.పవన్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి బి.వి. బాలాజీ BKMU జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.షావలి, రాజు, నిజాం భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు థామస్, ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.