ఆర్ఆర్ఆర్ పై సీబీఐ చార్జీషీట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో రఘురామతో పాటు.. ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీ, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు మొత్తం 16 మంది పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఓ ప్రకటనలో సీబీఐ తెలిపింది. రఘురామకు చెందిన ఇండ్ భారత్ కంపెనీ తమిళనాడులోని ట్యుటికోరన్ లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని బ్యాంకుల కన్సార్షియం నుంచి 947 కోట్లు రుణం తీసుకుంది. ఆ మొత్తంతో ప్లాంట్ నిర్మాణం పూర్తీ చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలు పాటించలేదు. కంపెనీ కోసం తీసుకున్న రుణాన్ని వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చుకున్నారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించారు. రఘురామ కంపెనీ రుణం తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దివాళ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ అనుమతి ఇచ్చింది.