భారత్ బంద్ జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టనున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి. రామాంజనేయులు పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ అధ్యక్షతన స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద బైక్ యాత్రను సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు బీ రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు రామాంజనేయులు, నిర్మల మాట్లాడుతూ కార్మిక చట్టాలలో మార్పులను ఉపసంహరించుకోవాలని , విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. ర్యాలీ కొత్త బస్టాండ్ ఇంద్ర గాంధీ నగర్ అశోక్ నగర్ రైల్వే స్టేషన్ ఫైవ్ రోడ్ జంక్షన్ ఎస్బిఐ సర్కిల్ పాత బస్టాండ్ వన్ టౌన్ చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ కలెక్టర్ కార్యాలయం మీదుగా సి క్యాంపు చేరింది. అక్కడ గౌస్ దేశాయ్ మాట్లాడుతూ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి అంజి బాబు, నగర అధ్యక్షులు పుల్లారెడ్డి, సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి రాముడు, సిటీ కార్యదర్శి రాజశేఖర్, సిఐటీయు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ , లాయర్స్ యూనియన్ నాయకులు వెంకట్ స్వామి, డివైఎఫ్ఐ నగర నాయకులు రాఘవేంద్ర నగర నాయకులు గోపాల్, సాయిబాబా , సుధాకర్, ఏసు, అబ్దుల్ దేశాయ్, షరీఫ్, మహిళా సంఘం నాయకురాలు చిట్టి తదితరులు పాల్గొన్నారు.