`నీరా` ఆరోగ్య ప్రదాయిని : మంత్రి శ్రీనివాస్ గౌడ్
1 min readపల్లెవెలుగువెబ్ : తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీరాలో పోషక విలువలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయం కు చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో గత 8 సంవత్సరాల నుండి పరిశోధనలు చేసి పీహెచ్ డి సాధించారన్నారు.