ఎన్జీవో రిజిస్ట్రేషన్ రద్దు.. ఇక నుంచి నో ఫండ్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ రెన్యూవల్ చేసుకోని ఎన్జీవోల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. 12,580 ఎన్జీవోల లైసెన్సులు గడువు నిన్నటితో ముగియడంతో వాటిని సీజ్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది.