ఎస్టీయూ క్యాలండర్, డైరీ ఆవిష్కరించిన డీఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర 2022 డైరీ, కేలండర్, జీ. ఓ. పుస్తకంను డీఈఓ వి. రంగారెడ్డి ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షులు హెచ్. తిమ్మన్న, ఆవిష్కరణ చేసినట్లు జిల్లాధ్యక్షకార్యదర్శులు యస్. గోకారి, డి. మౌలాలి తెలిపారు. డైరీ జీఓ పుస్తకాలు ఉపయోగకరంగా ఉన్నాయని డీఈఓ అన్నారు. చాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు జనార్దన్, షఫి, సుధాకర్ గౌడ్, ఇస్మాయిల్,గోయింద్,హనుమంతు, శేఖర్, దేవదాసు, అజాంబేగ్, పాల్గొన్నారు.