ఆత్మరక్షణకు టైక్వాండో సాధన అవసరం: కొంకతి లక్ష్మినారాయణ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో ఆదివారము జరిగిన టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లకు గౌరవనీయులైన ముఖ్యఅతిథిగా శ్రీ రాయలసీమ ప్రాంతం పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లవేళలా చదువుతోనే కాకుండా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ లో ఉన్న క్రీడలలో ఉన్న టైక్వాండో క్రీడ ఎంచుకొని పిల్లలు శ్రద్ధగా, క్రమశిక్షణతో, ప్రతిరోజు సాధన చేయాలిఅని చెప్పారు.మరియు క్రీడల పట్ల ఆసక్తి చూపడం చాలా సంతోషం అని తెలియజేశారు. అనంతరం పిల్లలు విన్యాసాలను తిలకించి వారికి బెల్టులు, మరియు బ్యాగులను, పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రవీణ్ ,పూజ, సతీష్, సాయి, అఖిల్ మరియు మాస్టర్లు M శివ K రోహిత్ K వెంకటేష్ సీనియర్ శిక్షకులు T వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.