PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాసనం… ఆరోగ్యానికి రక్ష : డీఎస్పీ మహేష్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : యోగాసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని కర్నూల్ టౌన్ డీఎస్పీ మహేష్ అన్నారు.  ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వ జాతీయ స్థాయి సాంస్కృతిక మేళాలో భాగంగా శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జరిగిన  జిల్లా స్థాయి యోగాసన పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎస్పి మహేష్ మాట్లాడుతూ విద్యతోపాటు యోగా పై విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.  ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల శరీర దృఢత్వం తో పాటు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందన్నారు.  ప్రతిరోజు  యోగా చేసేవారు కోపతాపాలకు దూరంగా ఉండగలుగుతారు అన్నారు. ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ యోగా పోటీలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ భూపతి రావు మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా యోగాసనాలు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా చేయాలన్నారు. 

ఎస్ వి  సుబ్బారెడ్డి ఫౌండేషన్ గౌరవాధ్యక్షురాలు  ఎస్ వి  విజయ మనోహరి మాట్లాడుతూ  యోగ భారతదేశంలో ప్రాచీన కాలం నుండి  ఆనవాయితీగా  నేర్పించ బడుతున్న విద్య అన్నారు. ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా పోటీలతో పాటు  సామాజిక  సమస్యలైన  పరిసరాలు పరిశుభ్రత తదితర అంశాలపై  నృత్య రూపక పోటీలను, యోగ ప్రాముఖ్యత అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించామన్నారు. జిల్లా స్థాయి యోగ పోటీలలో 150 మంది, వ్యాసరచన పోటీలలో 100 మంది  పాల్గొన్నారన్నారు.   స్వచ్ఛ భారత్ పై నిర్వహించిన లఘు నాటిక అందరిని ఆలోచింప జేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా సంఘ కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా యోగా సంఘము నిర్వాహక కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, యోగ పి .ఈ. టి నరేష్, విజయ్, మునిస్వామి, కళ్యాణి, శ్రీలత, గీత, సుప్రియ, మాధవి ,లక్ష్మి, శిరోమణి, లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, శివయ్య, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Author