ఇండస్ర్టీ అంటే.. ఆ నలుగురు హీరోలు కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : సినిమా ఇండస్ట్రీ పై ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని హితవు పలికారు. `సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమవ్వాలి. సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి
` అంటూ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.