వంగవీటి విషయం.. అనవసర రాద్ధాంతం !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత వంగవీటి రాధా పై రెక్కి నిర్వహించారన్న వార్తల నేపథ్యంలో మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, అది టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ అనుకోవచ్చు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చినా రాధా తిరస్కరించారని తెలిపారు.