లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయంగా సూచీలు మిశ్రమంగా కదులుతున్నప్పటికీ దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా సూచీలు ఫ్లాట్ గా ముగియగా.. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియాల్టీ సెక్టార్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 777 పాయింట్ల లాభంతో 59031 వద్ద, నిఫ్టీ 224 పాయింట్ల లాభంతో 17578 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 692 పాయింట్ల లాభంతో 36173 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.